Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగార్జున నుంచి మరో మల్టీ స్టారర్ .. టైటిల్ ఖరారు

  • తమిళంలో నాగ్ మల్టీ స్టారర్ 
  • 'నాన్ రుద్రన్' గా టైటిల్ ఖరారు 
  • త్వరలో తెలుగు టైటిల్ ప్రకటన
మొదటి నుంచి కూడా నాగార్జున మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇటీవల తెలుగులో మల్టీ స్టారర్ గా 'దేవదాస్' చేసిన ఆయన, ప్రస్తుతం హిందీలో ఒక మల్టీ స్టారర్ .. తమిళంలో మరో మల్టీ స్టారర్ చేస్తున్నారు. తమిళ సినిమా ధనుశ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ఒక హీరోగా ధనుశ్ .. మరో హీరోగా నాగార్జున నటించనున్నారు.తమిళంలో ఈ సినిమాకి 'నాన్ రుద్రన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు. అందువలన కొన్ని సన్నివేశాలను తెలుగులోను చిత్రీకరిస్తున్నారు. త్వరలో తెలుగు టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య .. అదితీరావు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.  తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.     
nagarjuna
dhanush

More Telugu News